CM KCR: సీఎం కేసీఆర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్ధుల భేటీ

Khammam District MLA Candidates Meet with CM KCR
x

CM KCR: సీఎం కేసీఆర్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్ధుల భేటీ 

Highlights

CM KCR: ప్రగతి భవన్‌‌కు రేగా కాంతారావు, తెల్లం వెంకటరావు.. మెచ్చా నాగేశ్వరావు , మదన్ లాల్

CM KCR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సీఎం కేసీఆర్‌‌ తో భేటీ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని తాజా రాజకీయాలపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తున్నారు. రేగా కాంతారావు, తెల్లం వెంకట్రావు , మెచ్చా నాగేశ్వరరావు , మదన్ లాల్ ప్రగతి భవన్‌‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు అలక, నిన్నటి ర్యాలీపై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. రేపు ఖమ్మంలో బీజేపీ రైతు భరోసా సభకు అమిత్‌ షా హాజరవుతున్నారు. దీంతో ఖమ్మం జిల్లా తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ఎన్నికల కో-ఆర్డినేషన్లు, జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అమిత్ షా వస్తున్న సందర్భంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు బీఆర్‌ఎస్ తెర లేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చిన్ని సత్యనారాయణ కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories