Tsrtc STrike : నేడు ఖమ్మం జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు

Tsrtc STrike : నేడు ఖమ్మం జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు
x
Highlights

-నేడు ఖమ్మం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ -డిపోలు, బస్టాండ్‌‌ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న కార్మికులు -ఖమ్మంలో భారీగా మోహరించిన పోలీసులు -సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులతో బందోబస్తు -భద్రతను పర్యవేక్షిస్తున్న ఐజీ నాగిరెడ్డి, ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇగ్బాల్ -శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులు తప్పవని హెచ్చరిక

నేడు ఖమ్మం జిల్లా బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఇవాళ డిపోలు, బస్టాండ్‌‌ల వద్ద ఆర్టీసీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో పోలీసులు భారీగా మోహరించారు. సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ నాగిరెడ్డి, ఖమ్మం సీపీ తఫ్సీర్ ఇగ్బాల్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఈనెల ఐదు నుంచి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆయన హైదరాబాద్ లో కన్నుమూశారు. కాగా.. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. వారి మద్దతుగా అఖిలపక్షాల నాయకులు, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య పట్ల చేసుకోవడంతో ప్రభుత్వ వైఖరి తప్పుపడుతూ.. ఆర్టీసీ కార్మికులు ఖమ్మం జిల్లా బంధుకు పిలుపునిచ్చారు. అయితే నేడు ప్రధాన డిపోల వద్ద ధర్నాల్లో అఖిలప‌క్ష నాయకులు పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories