Khammam: ఖమ్మం కార్పొరేషన్ ఖజానాకు గండి

Khammam: ఖమ్మం కార్పొరేషన్ ఖజానాకు గండి
x
Highlights

* ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో అలసత్వం వహిస్తున్న అధికారులు * వాణిజ్య ప్రాంతాల్లో పలు మున్సిపాలిటీ భవనాలు

Khammam: ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు. కళ్ల ఎదుటే ఆదాయ మార్గాలున్నా ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు అధికారులు. సాక్షాత్తూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ పరిస్థితి ఇది. మన్ను తిన్న పాములా వ్యవహరిస్తున్న అధికారుల తీరుతో ప్రతీ ఏటా ఖమ్మం కార్పొరేషన్ లక్షలాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతుంది.

ఖమ్మం జిల్లా కేంద్రంలో నగర పాలక సంస్థకు వేలాది గజాల భూములు ఉన్నాయి. దశాబ్దాల క్రితం ఆ స్థలాలలో భవన నిర్మాణాలు చేపట్టారు. వాణిజ్య ప్రాంతంలో నిర్మాణాలు కావడంతో వ్యాపారస్థులు పోటీ పడ్డారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లు నగర పాలక సంస్థ ధరలు నిర్ణయించింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకూ అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రతీ రెండు, మూడేళ్లకు బహిరంగ వేలం వేయాల్సిన అధికారులు తమకు ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండి పడుతోంది.

కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు అధికారులు కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. కార్పొరేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొందరు బినామీలు తమ పలుకుబడిని ఉపయోగించుకుని అక్రమాలకు తెర తీసారు. బహిరంగ మార్కెట్ కన్నా మున్సిపాలిటీ భవన సముదాయాల అద్దెలు తక్కువగా ఉండటంతో దళారుల కన్ను వీటిపై పడింది. అద్దెలు పెంచకుండా, టెండర్లు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories