Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం తేదీ ఖరారు..వరుసగా 4 రోజులు సెలవులు

Khairatabad Ganesh 2024
x

Khairatabad Ganesh 2024: ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం తేదీ ఖరారు..వరుసగా 4 రోజులు సెలవులు

Highlights

Khairatabad Ganesh 2024 nimajjanam date: ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం గురించి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఓ కీలక అప్ డేట్ ఇచ్చింది. గణేశ్ నిమజ్జనం ఎఫ్పుడో తెలుసుకుందాం.

Khairatabad Ganesh 2024: ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి అనగానే గ్రామాల నుంచి పట్టణాల వరకు సందడిగా ఉంటుంది. వాడవాడలో బొజ్జగణపయ్య పాటలతో హోరెత్తుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఈ గణేశ్ ఉత్సవాల్లో పాల్గొంటారు. 9 రోజుల పాటు ఎంతో వైభవంగా పూజలందుకుంటాడు లంబోదరడు. అయితే గణేశ్ ఉత్సవాల్లో కీలక ఘట్టం నిమజ్జనం. హైదరాబాద్ లో నిమజ్జనం అంటే పెద్ద సందడి ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో నగరమంతా సందడిగా ఉంటుంది. అయితే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం గురించి కీలక విషయం చెప్పింది భాగ్యనగరం గణేశ్ ఉత్సవ సమితి.

సెప్టెంబర్ 17వ తేదీన నిమజ్జనం ఉండబోతున్నట్లు తెలిపింది. ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. ప్రతి ఏడాది నిమజ్జనం రోజు హైదరాబాద్, సికింద్రాబాద్ లో ప్రభుత్వ సెలవు ఉంటుంది. ఈ సారి కూడా ఉంటుంది. కాగా ఈ సారి ఖైరతాబాద్ లో 70 అడుగుల సప్తముఖ మహాగణపతిని ప్రతిష్టిస్తున్నారు. గత ఏడాది మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తి చేశారు. ఈసారి కూడా ఆవిధంగానే చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా సెప్టెంబర్ 17న నిమజ్జనం ఉండటంతో జంటనగరాల్లోని విద్యార్థులకు వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ 14న నెలలో రెండో శనివారం ఉండటంతో ఆ రోజు పాఠశాలలకు సెలవు. మరుసటిరోజు ఆదివారం. సోమవారం అంటే సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్ ఇ మిలాద్ సందర్బంగా పాఠశాలలకు సెలవు ఉంది. ఇలా వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. 17వ తేదీన నిమజ్జనం ఉంది. కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉండే అవకాశం ఉంది. ఇలా వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories