HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
x

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. 

Highlights

HMDA: 45 పేజీలతో రిమాండ్ రిపోర్టు రిలీజ్ చేసిన ఏసీబీ

HMDA: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ సంచలన విషయాలు వెల్లడించింది. 45 పేజీల రిమాండ్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపింది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భారీగా ఆస్తులు, 50 ప్రాపర్టీ డాక్యుమెంట్లను సేకరించారు. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం ఐదు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఇది బహిరంగ మార్కెట్‌లో పది రెట్లు ఉంటుందన్నారు.

అక్రమంగా సంపాందించిన 99 లక్షల క్యాష్‌ను సోదాల్లో స్వాధీనం చేసుకున్నారు. అటు బ్యాంకు అకౌంట్లలో 58 లక్షల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. శివబాలకృష్ణ దగ్గర 51 లక్షల విలువైన కార్లు ఉన్నట్లు తెలిపింది ఏసీబీ. ఇవే కాక 8 కోట్ల 26 లక్షల విలువైన సిల్వర్‌ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు ఉన్నట్లు గుర్తించారు. మరో వైపు పలు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 155 డాక్యుమెంట్ షీట్లు, నాలుగు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. 20 ఎల్‌ఐసీ బాండ్లు, ఐటీ రిటర్న్స్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో లభించిన నాలుగు పాస్‌బుక్‌ల బినామీలను విచారించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలువురు బినామీలను గుర్తించినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories