టీఆర్ఎస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

టీఆర్ఎస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
x
Highlights

ప్రభుత్వ వైద్యులకు సెలవులు రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విషజ్వరాలు త్రీవంగా ఉండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లకు సెలవులు రద్దు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

ప్రభుత్వ వైద్యులకు సెలవులు రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విషజ్వరాలు త్రీవంగా ఉండడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల డాక్టర్లకు సెలవులు రద్దు చేసినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఫీవర్ ఆస్పత్రిలో 6 కౌంటర్లకు నుంచీ 25 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు మిగతా జిల్లా ఆస్పత్రుల్లో డాక్టర్లకు సెలవులు రద్దు చేశామన్నారు.

అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, మౌలిక వసతులను కల్పపనకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష‌్టీకరించారు. శాసనసభలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ పద్దులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జ్వరాలపై ప్రజలను గందరగోళానికి గురి చేయొదని... రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలే మంత్రి సూచించారు. వైద్యులను కూడా ఆలోచించి మంరింత సమయం కేటాయించి ప్రజలకు సేవ చేయాలని మంత్రి ఈటల కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories