Pinarayi Vijayan: కేసీఆర్ పోరాటానికి మా మద్ధతు

Kerala CM Pinarayi Vijayan Speech BRS Khammam Public Meeting
x

Pinarayi Vijayan: కేసీఆర్ పోరాటానికి మా మద్ధతు

Highlights

Pinarayi Vijayan: రాష్ట్రాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదు

Pinarayi Vijayan: ఖమ్మం సభ దేశానికి దిక్సూచి లాంటిదన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేసీఆర్ పోరాటానికి తమ మద్ధతు ఉంటుందన్నఆయన.. రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన ఉందన్న విజయన్ రాష్ట్రాల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. రాష్ట్రాలను కేంద్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని కేంద్రంలో అధికారంలో ఉన్నవారు సార్వభౌమత్వాన్ని విస్మరిస్తున్నారన్నారు. మతం పేరుతో ప్రజలను విడదీస్తున్నారన్న విజయన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ ర్యాంక్.. వన్ యూనిఫామ్ తదితర అంశాలన్నీ నినాదాలకే పరిమితమయ్యాయని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories