KCR: కేసీఆర్‌కు పూర్తైన సర్జరీ..

KCR surgery is complete
x

KCR: కేసీఆర్‌కు పూర్తైన సర్జరీ..

Highlights

KCR: 8 వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరమన్న డాక్టర్లు

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. ఎడమకాలు తుంటి మార్పిడిని వైద్యులు పూర్తి చేశారు. ఫామ్ హౌస్‌లో జారిపడిన కేసీఆర్.. ఎడమ తుంటికి తీవ్ర గాయం అయ్యింది. యశోద ఆస్పత్రిలో డాక్టర్ సంజయ్ వైద్య బృందం శస్త్ర చికిత్సను పూర్తి చేసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని.. 8 వారాలు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది.

కాగా.. కేసీఆర్ ఆరోగ్యంపై కొత్త సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ సెక్రటరీని యశోద ఆస్పత్రికి పంపించి.. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేసీఆర్‌కు గాయం విషయం తెలిసి.. అభిమానులు.. కార్యకర్తలు ఆస్పత్రికి క్యూ కట్టొద్దని.. ఇంట్లోనే కేసీఆర్ కోలుకోవాలని ప్రార్థించాలని.. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకోవాలని.. ప్రార్థించారు. మరోవైపు ఈ విష‍యం తెలిసి... ఏపీ సీఎం జగన్ సైతం విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని... ప్రార్ధించారు. నటుడు, మెగాస్టార్ చిరంజీవి సైతం.. విచారం వ్యక్తం చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories