నా మనసు కాలుతుంది.. అందుకే అడుగుతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రశ్నలు

నా మనసు కాలుతుంది.. అందుకే అడుగుతున్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రశ్నలు
x
Highlights

KCR Speech in Warangal Meeting: వరంగల్ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

KCR comments on Revanth Reddy govt: వరంగల్ బహిరంగ సభలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ అబద్దాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించినోళ్లు లేరని అన్నారు. ఇక్కడున్నోళ్లు సరిపోదన్నట్లు ఉన్న గాంధీలు లేని గాంధీలు అని ఢిల్లీ నుండి కూడా వచ్చి హామీలు ఇచ్చారు. కేసీఆర్ రైతు బంధు రూ. 10 వేలు మాత్రమే ఇస్తుండు... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ. 15 వేలు ఇస్తామని చెప్పిర్రు... ఇచ్చారా అని ప్రశ్నించారు. రూ. 2 వేల పెన్షన్ ను రూ. 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అది కూడా పెంచలేదని కేసీఆర్ గుర్తుచేశారు.

దివ్యాంగులకు రూ. 4 వేల పెన్షన్ స్థానంలో రూ. 6 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని అన్నారు. విద్యార్థులకు రూ. 5 లక్షల బ్యాంక్ కార్డు ఇస్తామని మాటిచ్చారు. ఇప్పటికీ రైతుల రుణాలు మాఫీ కాలేదని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న రూ. 1 లక్షకు తోడు తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. కానీ ఏ ఒక్క మాట కూడా ఇవ్వలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్ల మాట తీరు ఎలా ఉందంటే మా సిపాయి లేడన్నట్లు ముచ్చట చెబుతుర్రు అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. అప్పుడేమో ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడేమో మాకు ఎక్కడ అప్పు పుట్టడం లేదని కప్పిపుచ్చుకుంటున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు. ఓట్లు వేయించుకుని అవతల పడంగనే మాట మార్చేస్తారా? ఎక్కడైనా ఇంతటి దగా, మోసం ఉంటుందా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

"నా కళ్ల ముందే తెలంగాణ ఇట్లా ఇబ్బందుల పాలవడం చూసి నా మనసుకు బాదయితుంది, నా మనసు కాలుతుంది, నాకు దుఖం కలిగిస్తోంది. అందుకే ఇంతటితో ఆవేదనతో ఈ విషయాలన్నీ చెబుతున్నా" అని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories