రైతులంతా వంద శాతం రైతుబంధు సాయం పొందాలన్నదే మా అభిమతం : సీఏం కేసీఆర్

రైతులంతా వంద శాతం రైతుబంధు సాయం పొందాలన్నదే మా అభిమతం : సీఏం కేసీఆర్
x
CM KCR(File photo)
Highlights

ఏ పంట వేయడం ద్వారా రైతులకి మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగు చేస్తే రైతుకు ఏ ఇబ్బంది ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు.

ఏ పంట వేయడం ద్వారా రైతులకి మేలు కలుగుతుందనే విషయంలో వ్యవసాయశాఖ, వ్యవసాయ యూనివర్సిటీ తగు సూచనలు చేస్తుందని, దాని ప్రకారం పంట సాగు చేస్తే రైతుకు ఏ ఇబ్బంది ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం,పండించిన పంటకు మంచి ధర పొందాలన్నది తమ అభిమతం అని అన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసే విధానంపై చర్చించేందుకు గురువారం ప్రగతి భవన్ లో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో పలు అంశాలను చర్చించారు. మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నపంటలను పండిస్తే, తద్వారా రైతులకి పండించిన పంటకి మంచి ధర లభిస్తుందని కేసీఆర్ వెల్లడించారు.

గత సంవత్సరం వర్షాకాలంలో 40 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారని, ఈ ఏడాది కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలని అన్నారు. ఇక పత్తి సాగును మాత్రం ఇంకొంచం పెంచి 70 లక్షల ఎకరాల్లో పండించాలని అన్నారు. వరి, పత్తి తర్వాత రైతులు మక్కలు కాకుండా కంది పైన ద్రుష్టి పెట్టాలని సూచించారు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదని, సాగు చేయవద్దని దానికి బదులుగా దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో కంది పంటను సాగు చేయాలనీ అన్నారు. మక్కలు వేసే అలవాటు ఉన్న రైతులు పత్తి, కంది తదితర పంటలు వేసుకవాలని అన్నారు. ఇక ఆ తరవాత ఎప్పటిలాగే సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గత ఏడాది మాదిరిగానే వేసుకోవచ్చునని అన్నారు.

రైతులు ముందుగా పంట సాగు చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ఒకటి డిమాండ్ కలిగిన పంటలు పండించాలని, రెండు నాణ్యత కలిగిన పంటలు ఉత్పత్తి చేయాలని అన్నారు. అప్పుడే రైతుకి మంచి ధర వస్తుందని అన్నారు. నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం వల్ల రైతులకు మేలు కలుగుతుందని, అదే ప్రభుత్వానికి కావాల్సిందని అన్నారు. పండిన పంటకు మంచి ధర వచ్చినప్పుడే రైతులకు లాభం. ఆ ధర రావడం కోసమే ఈ ప్రయత్నమంతాని సీఏం కేసీఆర్ అన్నారు. ఇక రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం కోసమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేసీఆర్ వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories