సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ : కేసీఆర్

సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ : కేసీఆర్
x
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ అని ఆయన అన్నారు. సహజసిద్ధంగా పెరిగే పూలను ఆరాధించే గొప్ప వేడుకైనా బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్నారు. బతుకమ్మ పండుగ పురష్కరించుకొని దేవాలయాలు, చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలి అని అధికారులను కేసీఆర్ సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తుంది. బతుకమ్మ పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చీరలు పంచుతుంది. ముందుగా .. పూలతో బతుకమ్మను అందంగా తీర్చిదిద్దీ సాయంత్రం సమయంతో బతుకమ్మ పాటలు పాడతారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగకు రకరకాల నైవేధ్యం అమ్మవారికి పెడతారు. ఎంగిలి పువ్వు బతుకమ్మతో పండుగ మొదలై సద్దుల బతుకమ్మతో పండుగ ముగుస్తుంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories