కాళేశ్వరంలా 'పాలమూరు-రంగారెడ్డి'

కాళేశ్వరంలా పాలమూరు-రంగారెడ్డి
x
Highlights

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డిని శరవేగంగా పూర్తిచేసి, వచ్చే వర్షాకాలంలో నీళ్లివ్వాలని...

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డిని శరవేగంగా పూర్తిచేసి, వచ్చే వర్షాకాలంలో నీళ్లివ్వాలని ఆదేశించారు. అలాగే, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను జెట్-స్పీడ్‌‌తో పూర్తి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు.

కాళేశ్వరం మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా శరవేగంగా పూర్తిచేయాలని ఇరిగేషన్‌ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను జెట్ స్పీడ్‌‌తో పూర్తి చేయాలంటూ దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్ ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి పథకం గురించి చర్చించారు. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌ గోయింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడం ద్వారా పాలమూరులో సగం వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందన్న కేసీఆర్‌ మిగతా సగానికి పాలమూరు-రంగారెడ్డి పథకం ద్వారా నీరివ్వాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లాగే, రేయింబవళ్లు, మూడు షిఫ్ట్‌ల్లో పని చేసి, పాలమూరు ఎత్తిపోతల పధకాలను పూర్తి చేయాలన్నారు‌. ప్రాజెక్ట్ పరిధిలో రిజర్వాయర్లు, పంప్‌ హౌస్‌‌లు, కాలువల పనులను సమాంతరంగా చేపట్టాలని కేసీఆర్‌ సూచించారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి, పనుల్లో వేగం పెంచాలని కోరారు. ఏదేమైనాసరే వచ్చే ఏడాదికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories