ఆ బస్సులపై నా ఫోటో వద్దు : సీఎం కేసీఆర్

ఆ బస్సులపై నా ఫోటో వద్దు : సీఎం కేసీఆర్
x
ఐఏఎస్‌ల భారీ బదిలీలు..ఎందుకంటే..?
Highlights

కార్గొ బస్సులపై తన ఫోటో పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందన్న వార్తలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కార్గో బస్సులపై తన ఫోటో...

కార్గొ బస్సులపై తన ఫోటో పెట్టేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందన్న వార్తలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కార్గో బస్సులపై తన ఫోటో యేయ్యొద్దన్నారు. ఆర్టీసీ లాభాల్లో రావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. బస్సులపై ఫోటోలు యేయించుకుని ప్రచారం చేయాల్సిన అవసరం లేదని ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు సేవలు అందించాలి తప్ప చౌకబారు ప్రచారం తన అభిమతం కాదని అధికారులకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీకీ ప్రత్యేక కార్యదర్శి నోట్ పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories