పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలి : సీఎం కేసీఆర్

పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలి : సీఎం కేసీఆర్
x
పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలి : సీఎం కేసీఆర్
Highlights

పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలన్నారు సీఎం కేసీఆర్. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని తెలిపారు.

పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలన్నారు సీఎం కేసీఆర్. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని తెలిపారు. పట్టణాలు , నగరాలు దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపైనే ఉందన్నారు. ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సులో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాలి తప్ప అతిగా ఊహించుకోవద్దని సూచించారు. పక్కా ప్రణాళిక రూపొందించి అవగాహనతో పట్టణాలను అభివృద్ధి చేుకోవాలన్నారు. ప్రతి వార్డుకు శాశ్వతంగా ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.

రాజకీయాలంటే ఒకప్పుడు కష్టంతో, త్యాగంతో కూడుకున్నవి., బ్రిటిష్ వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయన్నారు. జాతి నిర్మాణంలో అంతా మమేకమైపోవాలని అన్నారు. " అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదు. 5 కోట్ల మందిలో తెలంగాణ ప్రజల్లో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లుగా అవకాశం వచ్చింది. దాన్ని సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చో వీ చేతుల్లోనే ఉంది 'అని కేసీఆర్ అన్నారు.

కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయని పోరాడాం. ప్రజలు నన్ను రెండు సార్లు సీఎంగా ఆశీర్వధించారని అన్నారు. నా వరకు రాజకీయం అంటే గెలిచేంత వరకే తర్వాత కాదు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది అర్థం అవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశాం. అని కేసీఆర్ అన్నారు. ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దని. అన్ని పనులు ఒక్కరోజులో చెస్తామని‎ మాట్లాడవద్దుని సూచించారు. అందరినీ కలుపుకుని పోవాలని, అందరి భాగస్వామ్యంతో అనుకున్నపట్టణాలను తీర్చిదిద్దాలని తెలిపారు. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై దృష్టి పెట్టాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories