KCR: ప్రచారంలో కారు జోరు.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగసభలు

KCR Medchal Jadcherla Tour Today
x

KCR: ప్రచారంలో కారు జోరు.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగసభలు

Highlights

KCR: గుండ్లపోచంపల్లి సమీపంలో బహిరంగ సభ

KCR: వరుస సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సీఎం కేసీఆర్. నిన్న సిరిసిల్ల, సిద్ధిపేటలో పర్యటించిన గులాబీ బాస్.. ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌లో పర్యటించబోతున్నారు. సభ ఎక్కడైనా.. కాంగ్రెస్సే టార్గెట్‌గా విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ సభతో సమరశంఖాన్ని పూరించిన సీఎం కేసీఆర్.. సుడిగాలి పర్యటనలతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. రోజూ కనీసం రెండు చోట్ల బహిరంగసభల్లో పాల్గొంటున్నారు.

ఆయన ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో భాగంగా ఇవాళ జడ్చర్ల, మేడ్చల్‌ బహిరంగ సభల్లో పాల్గొని కార్యకర్తలకు జోష్ నింపబోతున్నారు. గుండ్లపోచంపల్లి సమీపంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి 70 వేల పైచిలుకు జనసమీకరణ చేసేలా మంత్రి మల్లారెడ్డి ప్రణాళిక చేశారు. ఇక జడ్చర్లలోనూ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు.

Show Full Article
Print Article
Next Story
More Stories