Top
logo

ఆ రెండు కులాలపైనే కేసీఆర్‎కు మమకారం ఎక్కువ : మందకృష్ణ మాదిగ

ఆ రెండు కులాలపైనే కేసీఆర్‎కు మమకారం ఎక్కువ : మందకృష్ణ మాదిగ
X
Highlights

కేబినెట్‎లో బీసీ, రెడ్డీలకు మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. మంత్రివర్గంలో దళితులకు చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‎పై ఎమ్మార్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిప్పులుచెరిగారు. కేబినెట్‎లో బీసీ, రెడ్డీలకు మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. మంత్రివర్గంలో దళితులకు చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి, వెలమ, కులాల అభ్యర్థులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఎస్సీలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వలేదన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 22న హనుమకొండ కేడీసీ గ్రౌండ్‌లో మహాదీక్ష నిర్వహిస్తామన్నారు. దీనిపై కేసీఆర్ బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు.

Next Story