KTR: 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం

KCR Is Sure To Win Hat Trick As CM In Telangana Says KTR
x

KTR: 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం

Highlights

KTR: కాంగ్రెస్‌,బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆగమవుతాం

KTR: బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆగమవుతామన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన ఖైరతాబాద్‌ బీజేపీ నేత పల్లపు గోవర్ధన్‌కు.. కేటీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని.. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. మరోసారి అధికారంలోకి వస్తే.. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 3వేలు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టూ 400 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెప్పుకొచ్చారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories