KCR: వరుస పర్యటనలతో బిజీ కాబోతున్న గులాబిబాస్

KCR is going to be Busy with a Series of Tours
x

KCR: వరుస పర్యటనలతో బిజీ కాబోతున్న గులాబిబాస్ 

Highlights

KCR: పంచాయతీ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

KCR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస పర్యటనలతో గులాబిబాస్ కేసీఆర్ బిజీ కాబోతున్నారా? ఇప్పటికే ఓ వైపు అంబేద్కర్ విగ్రహం, మరోవైపు నూతన సచివాలయం వంటి వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్న కేసీఆర్ నెక్ట్స్ షెడ్యూల్ ఏంటి? అసలు కేసీఆర్ పర్యటనలు ఎప్పుడు,ఎక్కడ ఉండబోతున్నాయి? అభివృద్ధి కార్యక్రమాల తో పాటు ప్రజల ఉద్దేశించి ఆయన ప్రసంగం ఎలా ఉండనుంది. చూద్దాం

గత కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ గా ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు కేసీఆర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం, ఢిల్లీలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం, అనంతరం మహారాష్ట్ర పర్యటన, తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం, ఇలా ఒక్కొక్కటి గా ప్రారంభిస్తున్నారు. ప్రతి రోజు సమీక్షల తో బిజి బిజీ గా ఉంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే బిజీ బిజీగా సమీక్ష సమావేశం నిర్వహిస్తూ పాలనపై ప్రత్యేక దృష్టి సాధించారు. ఎప్పటికప్పుడు ఆయా శాఖలో జరుగుతున్న పని తీరుతోపాటు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు కేసీఆర్. మే నెలలో మహారాష్ట్ర నేతలకు హైదరాబాద్ వేదికగా ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు.

అంతేకాకుండా పంచాయతీ ఎన్నికల కి సిద్ధం అయ్యేలా కార్యాచరణ రూపొందించనున్నారు. తెలంగాణలో అభివృద్ధిని ఇప్పటికే మహారాష్ట్ర కి సంబంధించిన నేతలకు పలు వేదికల ద్వారా కళ్లకు కట్టే విధంగా చూపిస్తూ వస్తున్నారు బి ఆర్ ఎస్ నేతలు. అలాగే తెలంగాణలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుందో ...అదే విధంగా మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామని మహారాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఇక వచ్చే నెలలో 12 లక్షల మంది తో రైతులతో ర్యాలీ తీయనున్నారు. ర్యాలీకి ఇప్పటినుంచే మహారాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పించి రైతన్న మద్దతు కూడా కొట్టే విధంగా కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు.

బిఆర్ఎస్ అంటేనే రైతుల పార్టీ అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు. మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలతో మొదలుపెడితే ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధినేత భావిస్తున్నారు. ఒకపక్క హైదరాబాద్ వేదికగా ప్రతిరోజు మహారాష్ట్ర నేతలు బిఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇదే జోష్ ని కొనసాగిస్తూ అడుగులు వేయాలని వారు భావిస్తున్నారట. మొత్తానికి ఏప్రిల్ నెల నుంచి కేసీఆర్ మొదలు పెట్టిన కార్యక్రమాలతో బిజీ షెడ్యూల్ తో ఉండనున్నారు. దీంతోపాటు వచ్చే నెలలో మహారాష్ట్ర పై ప్రత్యేక దృష్టి సాధించే అవకాశం ఉందని టిఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories