జూలు దులపనున్న కేసీఆర్

జూలు దులపనున్న కేసీఆర్
x
Highlights

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జూలు దులపనున్నారు. రాజకీయంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధ్యక్షులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జూలు దులపనున్నారు. రాజకీయంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 19 జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పార్టీకి సంబంధించిన ప్రధాన అంశాలతోపాటు రాబోయే ఉద్యమాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రజా ఉద్యమం చేపట్టనుంది.

తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన 19 వతేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సమావేశం జరగనుంది.

ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొననుండటం ప్రత్యేకతను సంతరించుకుంది. మరో ఉద్యమానికి పార్టీ నేతలను సన్నద్ధం చేయడంతోపాటు ఆయన కూడా స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ఈ అంశంపైనే పార్టీలో ప్రధాన చర్చ జరుగుతోంది. కేసీఆర్ ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాళ్లు ఏర్పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. గతంలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన సందర్భంలో, రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ చర్యలు తీసుకోవడం కీలకమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో తనపై దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పని తీరును తీవ్రస్థాయిలో ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories