Tsrtc Strike : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Tsrtc Strike : సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి ప్రభుత్వం...

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపకూడదని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఇచ్చేది లేదని హైకోర్టుకు తెలపనున్నట్లు సమాచారం. తెలంగాణ హైకోర్టు ఆర్టీసీ కార్మికులు వేసిన పిటీషన్ రేపు విచారణకు రానున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ధర్మాసనం వెల్లడించనున్నట్ల తెలుస్తోంది.

ఆర్టీసీ అంశంపై సిఎం కెసిఆర్ శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ సంఘాలతో చర్చలు లేవని ఈ అఫిడవిట్‌లో పేర్కొనే అవకాశం ఉంది.

హైకోర్టులో సోమవారం కార్మికుల సమ్మెపై విచారణ కొనసాగనుంది. హైకోర్టులో ప్రభుత్వం తరపున బలమై వాదనలు వినిపించాలని అధికారులకు తెలిపారు.

ఈ సమావేశంలో కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టు వ్యాఖ్యలు, ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌, ఆర్టీసీకి చెల్లింపులు పలు అంశాలపై అధికారులతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ హాజరైయ్యారు‌ .ఆర్టీసీకి సంబంధించి రూ .47 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీకి చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 5,100 రూట్లలో ప్రైవేట్ రూట్ పర్మిట్లను అనుమతించాలని కేసీఆర్ క్యాబినెట్ ఇప్పటికే నిర్ణయించింది.

కార్మికులు తమ విధుల్లో చేరడానికి అవకాశం ఇచ్చినా వారు అవకాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీంలో సీఎం కెసిఆర్ మరింత దూకుడుగా నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్వసనీయ‎ సమాచారం. కార్మికులు విధులను నిర్వర్తించకపోతే మిగిలిన 5 వేల ప్రైవేటు పర్మీట్లు ఇవ్వడానికి వెనుకాడబోమని కేసీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేపు హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories