ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ ప్రచార సభ!

ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం 4గంటలకు సీఎం  కేసీఆర్ ప్రచార సభ!
x
Highlights

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్ కు చేరుకుంటోంది. రేపు ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో టీఆరెస్ లాస్ట్ పంచ్ కోసం గట్టి సన్నాహాలు చేసుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ చాలా సీరియస్ కసరత్తు చేస్తోంది.

గ్రేటర్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్ కు చేరుకుంటోంది. రేపు ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో టీఆరెస్ లాస్ట్ పంచ్ కోసం గట్టి సన్నాహాలు చేసుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ కోసం టీఆర్ఎస్ చాలా సీరియస్ కసరత్తు చేస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పి కొట్టేలా కేసీఆర్ మాట్లాడతారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఎల్బీ స్టేడియం లో సభ ఏర్పాట్ల కోసం టీఆర్ఎస్ యంత్రాంగం భారీగా సన్నాహాలు చేసుకుంటోంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు లక్షల మంది ఈ సభకు హాజరవుతారన్న అంచనాలున్న నేపధ్యంలో రెండు లక్షల మాస్క్ లను ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు వచ్చే వారు శానిటైజ్ చేసుకుని మాస్క్ ధరించాల్సి ఉంటుంది.

కేసీఆర్ సభ కోసం భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.. స్టేడియంలో మూడు స్టేజీలు ఏర్పాటు చేస్తారు. మొదటి స్టేజిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. రెండో స్టేజిని కళాకారులకోసం ఏర్పాటు చేయగా, మూడో స్టేజిపై పోటీ చేస్తున్న అభ్యర్ధులు ఉంటారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ బయట ఉన్న వారికోసం 12 స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ పై బీజేపీ ఘాటైన విమర్శలు చేస్తున్న నేపధ్యంలో విమర్శకుల నోళ్లు మూయించేలా కేసీఆర్ ప్రసంగం సాగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అనేక కీలక అంశాలపై కేసీఆర్ దీటైన సమాధానాలిస్తారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories