విలీనం అర్థరహితం...కార్మికులవి గొంతెమ్మ కోర్కెలు

విలీనం అర్థరహితం...కార్మికులవి గొంతెమ్మ కోర్కెలు
x
Highlights

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ విజయం అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మీడియాతో

హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ విజయం అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడాతూ.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు పిచ్చి పంథాను ఎంచుకున్నారని అన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ కార్మికులవి అర్థంపర్థం లేని డిమాండ్లని ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చాలా ప్రయత్నించానని చెప్పారు. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసంబద్ధమైనదన్నారు.

ఆర్టీసీనే ముగుస్తుంది

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆర్టీసీ వాళ్లు అవగాహనరాహిత్యంతోనే సమ్మెకు దిగారని మండిపడ్డారు. యూనియన్‌ ఎన్నికల సమ్మెకు దిగారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారి చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె ముగియడం కాదని, ఆర్టీసీనే ముగుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని, దాని పని అయిపోయిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది అసంబద్ధమైన, అర్థరహితమైన నినాదమని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం పరిధిలో 57 కార్పొరేషన్లు ఉన్నాయి. వారు కూడా విలీనం అడిగితే ఏం చేయాలి? ప్రభుత్వానికి ఓ విధానం ఉంటుంది. సమ్మెతో వేయి శాతం పాత ఆర్టీసీలు ఉండే అవకాశం లేదన్నారు. ఆర్టీసీ ముగుస్తుంది. సమ్మె కాదు ఆర్టీసీనే ముగిసిపోయింది. ఇట్స్ గాన్ కేస్ అంటూ కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

రోజుకు మూడు కోట్ల నష్టం

ఆర్టీసీ బస్సులకు రోజుకు మూడు కోట్ల మేర నష్టం వస్తుంటే, ప్రైవేట్ బస్సులకు నాలుగు లక్షల లాభం వస్తోందని తెలిపారు. కొందరూ చిల్లర రాజకీయాలు చేసి ఆర్టీసీని ముంచుతున్నారని, వారికి అనుకూలంగా కార్మికులు కూడా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి నెల ఆర్టీసీకి వంద కోట్లు నష్టం వస్తుందని, కార్మికుల వల్లే ఆర్టీసీ నష్టాల బాట పట్టిందని తెలిపారు. నెలకు రూ.50వేల జీతం తీసుకుంటూ అవసరమైనప్పుడు గంట కూడా ఎక్కువ పనిచేయరా అని కేసీఆర్ నిలదీశారు.

ఏపీలో కూడా ఇదే జరుగుతోంది

ఏపీలో ఆర్టీసీ విలీనంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఆర్టీసీ విలీనంపై కేవలం కమిటీ మాత్రమే వేశారని తెలిపారు. విలీనం చేయలేదని గుర్తు చేశారు. కమిటీ నివేదిక ఏప్పుడు వస్తుందో తెలియదని, వస్తే ఏం చెబుతుందో ఎవరికీ తెలియదన్నారు. ఏపీలో కూడా జరిగేది ఇదే రాసుకోండి అని వ్యాఖ్యానించారు.

యూనియన్ల పేరుతో కార్మికుల గొంతు కోస్తున్నారు

ఆర్టీసీ యూనియన్ల పేరుతో కొందరూ కార్మికుల గొంతు కోస్తున్నాయని చెప్పారు. కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీని స్వయంగా వాళ్లే ముంచుతున్నారని, డ్రైవర్లు, కండక్టర్లతో పంచాయితీ లేదు. సంస్థను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేయండని తెలిపారు. యూనియన్లు లేకుండా పని చేస్తే లక్ష బోనస్ తీసుకుంటారన్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నారు. ఆర్టీసీ పోటీ ఉండాలని ప్రధాని చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. బీజేపీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎందుకు చేయడం లేదన్నారు. ప్రైవేట్‌ బస్సుల నుంచి పోటీని తట్టుకుని నిలబడితేనే ఆర్టీసీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు.


ఆర్టీసీని ఎవరూ కాపాడలేరు

అద్దె బస్సులు వద్దని డిమాండ్ చేస్తారా? మన బాధ్యత ఏంటో తెలుసుకోవాలన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఇచ్చిన నిధులు రూ.712 కోట్లు. టీఆర్ఎస్ అధికారం చేపట్టాక ఇచ్చిన నిధులు 4,250కోట్లు విడుదల చేశాం. ఈ సంవత్సరం బడ్జేట్ లో రూ.550 కోట్లు కేటాయించాం. ఇప్పటికే రూ.425 కోట్లు విడుదల చేశామని తెలిపారు. సమ్మెపై స్పందించాం. కమిటీ వేశాం. సమ్మెకు వెళ్తామని చెప్పగానే చర్చలు జరిపాం అని కేసీఆర్ తెలిపారు. కార్మికుల వేతనాలు 67 శాతం పెంచామని, దేశంలో ఎక్కడైనా పెంచిన చరిత్ర ఉందా అని కేసీఆర్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories