CM KCR: దేశమంతా ఉచిత విద్యుత్.. దళిత బంధు

KCR Comments On Free Power And Dalit Bandhu
x

CM KCR: దేశమంతా ఉచిత విద్యుత్.. దళిత బంధు

Highlights

CM KCR: ఏటా 23 లక్షల మందికి దళితబంధు

CM KCR: దేశవ్యాప్తంగా BRS బలోపేతం చేసే దిశగా గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన BRS అధినేత, సీఎం కేసీఆర్ తన మొదటి అడుగు ఏపీలో పెట్టారు. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అంతమాత్రమే కాకుండా BRS ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తూ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రావెల కిశోర్ జాతీయ స్థాయిలో పని చేయాల్సిన వ్యక్తి అని తెలిపారు. పార్థసారథి సేవలు కూడా ఉపయోగించుకుంటామని చెప్పారు.

అనుకున్నట్లుగానే ఏపీకి చెందిన మాజీ IAS తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, మాజీ IRS పార్థసారథి సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

ఏపీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ, ఏపీ కాదు.. దేశంలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లోనూ BRS పోటీ చేస్తుందన్నారు. దేశంలో ద్వేషం పెంచితే ఎవరు నాశనమవుతారని ప్రశ్నించారు. అధికారంలోకి రావడమే BRS లక్ష్యం కాదన్న కేసీఆర్.. భారతదేశ పురోగమనాన్ని మార్చడమే BRS లక్ష్యమన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడిపేస్తున్నారని విమర్శించారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం మతపిచ్చి సృష్టిస్తే దేశం ఏమవుతుందని ప్రశ్నించారు.

దేశంలో BRS అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌ వేదికగా హామీలు కురిపించారు. BRS అధికారంలోకి వచ్చిన తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. BRS వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ తయారవుతుందన్నారు. BRS అధికారంలోకి వచ్చాక ఏటా 2.5 లక్షల కోట్లతో 25 లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు అమలు చేస్తామన్నారు కేసీఆర్.

ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే నిలిపివేస్తామన్నారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మినా.. మళ్లీ BRS తిరిగి తీసుకుంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories