Modi: ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ఢిల్లీ వచ్చారు, కానీ.. బాంబు పేల్చిన మోడీ

KCR Came To Delhi To Join NDA Said Modi
x

Modi: ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ఢిల్లీ వచ్చారు, కానీ.. బాంబు పేల్చిన మోడీ

Highlights

Modi: నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదు

Modi: నిజామాబాద్ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద లూటీ అవుతుందన్నారు. కేంద్రం ఇచ్చిన వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచేస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేశారు మోడీ. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తన వద్దకు వచ్చారని, ఎన్డీయేలో చేరతానను అడిగారన్నారు. కానీ అందుకు తాను ఒప్పుకోలేదన్నారు మోడీ. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి గురించి ప్రస్తావించానన్నారు. నేను ఇక అలసిపోయానని.. బాధ్యతలను కొడుకు కేటీఆర్‌కు అప్పగిస్తానని నాతో చెప్పారన్నారు. అందుకే తాను.. మీరేమైనా రాజులా..? యువరాజును రాజును చేయడానికి అని ప్రశ్నించానన్నారు. అధికార పీఠం ఎవరికి ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పానని మోడీ అన్నారు. నాటి నుంచి నా నీడ అంటేనే కేసీఆర్‌కు భయం పట్టుకుందని, నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories