Kavitha: రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో

Kavitha: రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో
x

Kavitha: రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో

Highlights

Kavitha: రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు.

Kavitha: రాహుల్ గాంధీ జీ దో లాక్ నౌకరీ దో అంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదిక ద్వారా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యిందని గుర్తుచేశారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న మీకు మా నిరుద్యోగుల గోడు పట్టదా అని ప్రశ్నించారు.

యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారింది, జాబ్ క్యాలెండర్ పత్తా లేదు, ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories