Karvy Scam: రూ.3,520 కోట్లకు చేరిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసాలు

Karvy Stock Broking Scams Reached 3520 Crores | Telugu Online News
x

Karvy Scam: రూ.3,520 కోట్లకు చేరిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ మోసాలు

Highlights

Karvy Scam: పోలీసులకు ఫిర్యాదు చేసిన పలువురు బ్యాంక్ ప్రతినిధులు...

Karvy Scam: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ అక్రమాలపై నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు పోలీసులు. 5వేల పేజీల చార్జిషీట్‌లో కార్వీ సంస్థ మోసాలను పొందుపర్చారు. కాగా.. కార్వీ సంస్థ మోసాలు 3వేల 520 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 8 ఏళ్ల నుంచి బ్యాంక్‌ల నుండి రుణాలు పొందిన కార్వీ సంస్థ, కస్టమర్ల షేర్లను తమ షేర్లుగా చూపించి బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. కస్టమర్ల షేర్లలోని 720 కోట్ల రూపాయలను కార్వీ ఇతర సంస్థలకు మళ్లించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories