తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
x
Highlights

తెలుగు రాష్ర్టాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వశిష్ట గోదావరి తీరం భక్తుల రద్దీ నెలకొన్నది. తెల్లవారు జాము నుంచే భక్తులు నదీ...

తెలుగు రాష్ర్టాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వశిష్ట గోదావరి తీరం భక్తుల రద్దీ నెలకొన్నది. తెల్లవారు జాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. శ్రీశైలం, పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని శివాలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లాలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదీ స్నానాలు ఆచరించి భక్తి శ్రద్దలతో ఆలయాల్లో పూజలు నిర్వహించారు. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

శేరిలింగంపల్లి

కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివ నామస్మరణతో మారుమ్రోగాయి. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామివారి దర్శించేందుకు బారులు తీరారు. మహిళలు ఆలయాలలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వివిధ అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

ఖమ్మం


ఖమ్మం జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొన్నది. భద్రాచలం గోదావరినదీ తీరంలో కార్తీక స్నానాలు ఆచరించారు. ఖమ్మం పట్టణంలోని చారిత్రక గుంటుమల్లన్న దేవాలయంలో స్వయంభు శివలింగానికి అభిషేక పూజలు చేశారు.

కర్నూలు

జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్ని కొత్త శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుండే శ్రీశైలం, మహానంది ,అహోబిలం, యాగంటి పుణ్యక్షేత్రాల్లో భక్తులు భారీ ఎత్తున బారులు తీరారు. కార్తీక స్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు భక్తులు.

నిజామాబాద్

జిల్లా వ్యాప్తంగా కార్తీక శోభ సంతరించుకుంది. జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని చారిత్రక నీలకంఠేశ్వరాలయంలో మహిళలు దీపారాధన చేశారు.

ప్రకాశం

కార్తీక పౌర్ణమి సందర్బంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రతీరం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి సముద్ర తీరంలో దీపాలు వెలిగించారు. జిల్లాలోని శివాలయాల్లో భక్తులు బారులు తీరారు. సంతబజారు లోని మల్లేశ్వర స్వామి ఆలయం, పేరాల పునుగు రామలింగేశ్వరాలయానికి భక్తులు తరలివచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories