కామారెడ్డి జిల్లా మద్నూరు ఆదర్శ పాఠశాల... ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్

* తెలుగు టీచర్‌ మహేశ్వరి సస్పెండ్... ప్రిన్సిపాల్‌ను జగిత్యాల మోడల్ స్కూల్‌కు బదిలీ చేసిన అధికారులు

R Tripura Malini
Published on: 2 Dec 2022 12:53 PM IST
Kamareddy District School Incident High Officials Are Serious About The Incident
X

కామారెడ్డి జిల్లా మద్నూరు ఆదర్శ పాఠశాల... ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్

Kamareddy: కామారెడ్డి జిల్లా మేనూరు ఆదర్శ పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇంటర్ విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదడం అసభ్య పదజాలంతో టీచర్ దూషించిన ఘటనపై ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. టీచర్ చేసిన నిర్వాకంపై హెచ్ఎంటీవీ కథనం ప్రసారం చేసింది. దీనికి ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం అధికారుల చర్యలు తీసుకున్నారు. విద్యార్థిని అసభ్య పదజాలంతో దూషిస్తూ చితక బాదిన తెలుగు టీచర్‌ మహేశ్వరిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మేనూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌ను జగిత్యాల ఆదర్శ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story