K Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే నియామకం.. కేబినెట్ హోదా..

K Keshava Rao Appointed As Telangana Govt Advisor
x

K Keshava Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే నియామకం.. కేబినెట్ హోదా..

Highlights

K Keshava Rao: కే. కేశవరావును రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

K Keshava Rao: కే. కేశవరావును రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎఫైర్స్‌‌కు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారని.. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు కేకే. కేకే తన రాజ్యసభ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కడ్‌ను కలిసి స్వయంగా రాజీనామా లేఖ అందించారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్టు కేకే వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories