కొల్లాపూర్ టీఆర్ఎస్ లో తారాస్థాయికి వర్గపోరు.. సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే బీరం, జూపల్లి

కొల్లాపూర్ టీఆర్ఎస్ లో తారాస్థాయికి వర్గపోరు.. సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే బీరం, జూపల్లి
x
Highlights

Kollapur: సై అంటే సై అంటున్న ఎమ్మెల్యే బీరం, జూపల్లి

Kollapur: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో టీఆర్ఎస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బహిరంగ చర్చకు ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అయితే మాజీ మంత్రి జూపల్లి ఇంటి ముందు చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి.. జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకోవడంతో.. సిచువేషన్ టెన్షన్ గా మారింది. ఇద్దరు నాయకులు తమ అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ నెల 26 న చర్చకు పోలీసులు అనుమతిస్తారా..? కొల్లాపూర్ లో 144 సెక్షన్ విధిస్తారా..? లేక.. అంతకుముందే ఇద్దరు నాయకులను హౌజ్ అరెస్ట్ చేస్తారా..? దీనిపై నియోజకవర్గంలో పోటాపోటీగా చర్చ జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories