అమ్నేషియా పబ్ వ్యవహారంలో కీలక మలుపు.. బాలికను ట్రాప్ చేసినట్లు ఒప్పుకున్న నిందితులు

Jubilee Hills Police Arrested 5 Accused In Amnesia Pub Case | Hyderabad
x

అమ్నేషియా పబ్ వ్యవహారంలో కీలక మలుపు

Highlights

*నేడు ఎంఐఎం కార్పొరేటర్‌ను విచారించనున్న పోలీసులు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచార ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతల ఆరోపణల నేపథ‍్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తాజాగా బాలిక అత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలికను ట్రాప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. బాలికను పరిచయం చేసుకున్న ఓ కార్పొరేటర్ కుమారుడు మిగిలిన స్నేహితులకు పరిచయం చేసినట్లు విచారణలో వెల్లడైంది.

మరోవైపు ఓ ఎంఐఎం కార్పొరేటర్‌ను ఇవాళ పోలీసులు విచారించనున్నారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత వారిని మొయినాబాద్‌లోని తన ఫామ్‌హౌస్‌కి తన కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులతో పాటు ఇన్నావో కారును కూడా దాచాడు. దీంతో ఇవాళ కార్పొరేటర్‌ను విచారణకు రావాల్సిందిగా జూబ్లీహిల్స్ పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది.

మరోవైపు కారులో క్లూస్‌ను నిందితులు సాదుద్ధీన్ మాలిక్, ఉమేర్ ఖాన్ చెరిపేశారు. ఇప్పటికే బెంజ్ కారులో కీలక ఆధారాలను ఫోరెన్సిక్ నిపుణులు సేకరించారు. వీడియోలు ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిని A6గా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కుమారుడు దుబాయ్‌కు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు అమ్నేషియా పబ్ యాజమాన్యం స్టేట్‌మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. నాన్ ఆల్కహాల్ పార్టీకి ప్లస్ వన్, ప్లస్ టు 150 మంది విద్యార్థులకే అనుమతి ఉండగా 180 మంది విద్యార్థులు పార్టీకి హాజరైనట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories