జేఎన్ టీయూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా

జేఎన్ టీయూ డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా
x
JNTU exams cancelled (representational image)
Highlights

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలం అయ్యింది. విద్యార్థులకు సైతం ఎప్పుడు పరీక్షలు, ఏ సమయంలో పాఠశాలలు, కాలేజీలు తెరుస్తారో వారికే తెలియడం లేదు....

కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలం అయ్యింది. విద్యార్థులకు సైతం ఎప్పుడు పరీక్షలు, ఏ సమయంలో పాఠశాలలు, కాలేజీలు తెరుస్తారో వారికే తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణా ప్రభుత్వం ఏకంగా పది పరీక్షలనే రద్దు చేయకతప్పలేదు. దీంతో పాటు పలు పరీక్షలను వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన జేఎన్టీయు డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇప్ప‌టికే ప‌లు ఎగ్జామ్స్ వాయిదాప‌డ్డ విష‌యం తెలిసిందే. ప‌ద‌వ త‌ర‌గ‌తి పరీక్ష‌లు అయితే ఏకంగా ర‌ద్ద‌య్యాయి. తాజాగా జేఎన్టీయూ ప‌రిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కూడా వాయిదా ప‌డ్డాయి. జూన్- 20 నుండి జరగాల్సిన‌ యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు శుక్ర‌వారం జేఎన్టీయూ అనౌన్స్ చేసింది. గ‌వ‌ర్న‌మెంట్ ఆర్డ‌ర్ లేకుండా ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద నుంచి ఆదేశాలు అందిన పిమ్మట‌ పరీక్షలు నిర్వహిస్తామని వివ‌రించారు యూనివ‌ర్సిటీ అధికారులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories