Jharkhand Politics: హైదరాబాద్‌ వేదికగా ఆపరేషన్‌ జార్ఖండ్‌.. టీపీసీసీ భారీ ప్లాన్‌!

Jharkhand Politics As Hyderabad State
x

Jharkhand Politics: హైదరాబాద్‌ వేదికగా ఆపరేషన్‌ జార్ఖండ్‌.. టీపీసీసీ భారీ ప్లాన్‌!

Highlights

Jharkhand Politics: ఈనెల 5 వరకు హైదరాబాద్‌లోనే జార్ఖండ్ ఎమ్మెల్యేలు

Jharkhand Politics: జార్ఖండ్‌లో చంపై సోరెన్ ప్రభుత్వం కొలువుదీరిన గంటలోనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్, JMM పార్టీలు క్యాంప్ పాలిటిక్స్‌కు తెరతీశాయి. తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రమాణస్వీకారం వెంటనే హైదరాబాద్‌‌కు తరలించాయి.

జార్ఖండ్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో క్యాంపులు ఏర్పాటు చేయగా.. టీపీసీసీ నేతలకు ఆ బాధ్యత అప్పగించింది ఏఐసీసీ. దీంతో రిసార్టులు బుక్ చేసి 40 మంది కాంగ్రెస్, JMM ఎమ్మెల్యేలను తరలించారు. ఎమ్మెల్యేల బాధ్యతను AICC సెక్రటరీ సంపత్ కుమార్..మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పజెప్పింది టీపీసీసీ. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ ఎప్పటికప్పుడు పరిస్థితులు మానిటరింగ్ చేస్తున్నారు. పదిరోజుల్లో జార్ఖండ్ ప్రభుత్వ బలపరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఉండగా.. ఈనెల 5 వరకు హైదరాబాద్‌లోనే జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉండనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories