కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరామ్

కేసీఆర్‌పై మండిపడ్డ కోదండరామ్
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు....

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు పెనం మీద ఉన్నట్టుంటే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు పొయ్యిలో ఉన్నారని కోదండరామ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలతో నిరుద్యోగులు, ఉద్యోగులు కష్టాల్లో పడ్డారని ఆయన వరంగల్‌లో ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు వెట్టి కార్మికులుగా పనిచేస్తున్నారని, ఉద్యోగులు పని భారంతో ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రజలందరూ తమకు మద్దతు తెలపాలని కోదండరామ్ కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై వారికి పూర్తి అవగాహణ ఉందని అందుకే వారు ప్రభుత్వంతో కొట్లాడగలుగుతున్నామని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆయన వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టుభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగాలని కొద్దిరోజుల క్రితమే నిర్ణయించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల మద్దతు కూడగడతామని కోదండరామ్ తెలిపారు. ఇందులో భాగంగానే ఆయన ఇప్పటికే ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలో దింపుతుందా లేక కోదండరామ్‌కు మద్దతు ఇస్తుందా అన్నది మాత్రం ఇంకా తేలలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories