ప్రచార సమయంలో కరెంట్‌షాక్‌తో రెండు కాళ్లు కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన జగ్గారెడ్డి

Jaggareddy visited the Family who lost both legs due to Electric shock During the campaign
x

ప్రచార సమయంలో కరెంట్‌షాక్‌తో రెండు కాళ్లు కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించిన జగ్గారెడ్డి

Highlights

Jagga Reddy: బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న జగ్గారెడ్డి

Jagga Reddy: ఎన్నికల ప్రచార సమయంలో కరెంట్ షాక్‌తో రెండు కాళ్లు కోల్పోయిన కుటుంబాన్ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు. సదాశివపేట మండలం నిజాంపూర్‌ గ్రామంలో బాధిత ఓదార్చారు. బాధితుని భార్య కుట్టు మిషన్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. బాధితురాలి భార్య తన కుటుంబ కష్టాలు, అప్పులు, బాధలను జగ్గారెడ్డికి చెప్పుకుంది.

15లక్షల వరకు అప్పులు ఉన్నాయని తెలిపింది. కుట్టు మిషన్‌తో వచ్చే డబ్బు వడ్డీలకే సరిపోవడం లేదని పేర్కొంది. కుటుంబ పోషణకు ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ.. చీరల వ్యాపారం చేసుకోవడానికి లక్షా 50వేలు ఆర్థికంగా సహాయం అందిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఆ కుటుంబం తీసుకున్న అప్పులు కూడా తానే తీరుస్తానని భరోసానిచ్చారు జగ్గారెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories