Jagga Reddy: రాహుల్ గాంధీని చంపుతామని బెదిరించడం పిరికిపంద చర్య

Jagga Reddy sensational comments on BJP and RSS
x

Jagga Reddy: రాహుల్ గాంధీని చంపుతామని బెదిరించడం పిరికిపంద చర్య

Highlights

Jagga Reddy: రాహుల్ గాంధీని BJP, RSS నాయకులు చంపుతామని బెదిరించడం పిరికిపంద చర్యని ఆయన ఫైర్ అయ్యారు.

Jagga Reddy: మహాత్ముడి స్ఫూర్తితో రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తుంటే.. బీజేపీ మతం చిచ్చు రగిలిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. భారతీయులంతా కుల, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలన్న లక్ష్యంతో రాహుల్ యాత్ర సాగుతోందన్నారు. యాత్రలో భాగంగా స్వాతంత్ర్యకాలం నాటి వాస్తవాలను రాహుల్ చెబితే.. బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఎదురుదాడి చేశారు. వీర సావర్కర్ బలహీనతల వల్లే బ్రిటిష్ వాళ్లకు లొంగిపోయారన్న విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడంలో తప్పేం ఉందని జగ్గారెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీని BJP, RSS నాయకులు చంపుతామని బెదిరించడం పిరికిపంద చర్యని ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్‌పై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు గాంధీభవన్‌లో నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని మోడీ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories