ఘనంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కుమార్తె జయారెడ్డి జన్మదిన వేడుకలు

Jagga Reddy Birthday Celebration | TS News
x

ఘనంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కుమార్తె జయారెడ్డి జన్మదిన వేడుకలు

Highlights

*గణేష్ గడ్డ ఆలయంలో జగ్గారెడ్డి కుటుంబసభ్యుల ప్రత్యేక పూజలు

Jagga Reddy Birthday Celebration: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో ఇద్దరి బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. సంగారెడ్డిలో భారీ కటౌట్లు, బ్యానర్ల‌ు ఏర్పాటు చేశారు. గణేష్ గడ్డ ఆలయంలో జగ్గారెడ్డి కుటుంబంసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ గడ్డ నుంచి సంగారెడ్డి ఐబీ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఐబీలో 50 కిలోల భారీ కేక్‌ను కట్ చేయనున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని ఆస్పత్రులు, అనాథ ఆశ్రమంలో పండ్లు పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories