Jagadish Reddy: చీకట్లో నడిచేవారు వెలుగును సృష్టించలేరన్న జగదీశ్ రెడ్డి

Jagadish Reddy Fires On Congress Party Leaders
x

Jagadish Reddy: చీకట్లో నడిచేవారు వెలుగును సృష్టించలేరన్న జగదీశ్ రెడ్డి

Highlights

Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ నిరసనలపై మంత్రి మండిపాటు

Jagadish Reddy: దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ చేపట్టబోయే నిరసనల అంశంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు నిరసన తెలియజేశారనీ,అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇంకా బుద్ధి తెచ్చుకోక అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

దశాబ్ది ఉత్సవాల్లో ఏది అవాస్తవమని నిరసన చేస్తారు అన్న మంత్రి ప్రజలకు సంక్షేమ అందటం అవాస్తవమా అన్నారు. మేము వేసిన రోడ్ల మీద నడుస్తున్నది అవాస్తవమా, మేమిస్తున్న మంచినీళ్లు ప్రతిపక్షాలు తాగడం మీ ఇళ్లలో వేస్తున్న స్విచ్ ద్వారా కరెంట్ వచ్చేది అవాస్తవమా.. అంటూ ప్రశ్నించారు. ఫ్లోరిన్ నీటి నుండి విముక్తి చేయడం అవాస్తవమా.. ఏ అభివృద్ధి జరగలేదో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయన్నారు. చీకట్లో నడిచే వారు వెలుగును సృష్టించలేరన్న మంత్రి జగదీష్ రెడ్డి వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికి చీకట్లోనే ఉండి పోతారని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories