Telangana: కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Government Decided to Do a House Fever Survey | TS News Today
x

Telangana: కరోనా కేసులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం 

Highlights

Telangana: రేపటి నుంచి ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయం

Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో కరోనా నియంత్రణ, క్షేత్ర స్థాయిలో ప్రజల ఆరోగ్య పరిస్థితులు పరిశీలించి తగిన చర్యలు చేపట్టడం లక్ష్యంగా మరోసారి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా ప్రతి పట్టణం, గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి జ్వర సర్వే చేయనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య, మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల సమన్వ యంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తారని.. జ్వరం, కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇస్తారని తెలి పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తామని.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. కరోనా రెండో వేవ్‌ సమయంలో రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే, హోం ఐసోలేషన్‌ కిట్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. నీతి ఆయోగ్, ఎకనామిక్‌ సర్వే రిపోర్టు కూడా ఇంటింటి సర్వేను ప్రశంసించాయని గుర్తు చేశారు.

రాష్ట్రంలో రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు, కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలి పారు. కిట్లు లేవన్న భావన రాకుండా గ్రామ స్థాయిలో పంపిణీ చేశామని, వార్డు స్థాయిలోనూ ఉంటాయని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో కార్య దర్శులు, ఇతర అధికారుల సాయంతో సర్వే నిర్వ హిస్తామన్నారు. కరోనా చికిత్సలకు సంబంధించి అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామని, మందులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. చిన్న పిల్లల కోసం అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డు లు, వెంటిలేటర్లు, మందులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అవసరమైన వారందరికీ చికిత్సలు చేస్తామని హరీష్ రావు చెప్పారు. జ్వర సర్వేలో ప్రజాప్రతినిధులు: ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా పాల్గొనున్నారు.

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇంటింటి ఫీవర్ సర్వే చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి ప్రతీ ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేస్తారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి.

Show Full Article
Print Article
Next Story
More Stories