IT Raids: హైదరాబాద్, వరంగల్‌లో వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ సోదాలు

IT Raids: హైదరాబాద్, వరంగల్‌లో వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ సోదాలు
x

IT Raids: హైదరాబాద్, వరంగల్‌లో వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌పై ఐటీ సోదాలు

Highlights

హైదరాబాద్‌లోని ప్రముఖ వాసవి రియల్ ఎస్టేట్ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. క్యాప్స్ గోల్డ్‌కు అనుబంధంగా ఉన్న ఈ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్, సౌమ్యకు చెందిన పలు కంపెనీలపై కూడా ఐటీ శాఖ తనిఖీలు చేపట్టింది. వాసవికి సంబంధించిన సుమారు 40 కంపెనీల లావాదేవీలపై అధికారులు ఆరా తీశారు.

ఈ సోదాలు వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్‌తో పాటు చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులపై కూడా జరిగాయి. చందా కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న పలు సంస్థల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌తో పాటు వరంగల్, విజయవాడల్లోనూ ఐటీ సోదాలు జరిగాయి. కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ వంటి సంస్థలలో కూడా అధికారుల దృష్టి నిలిచింది. బోయిన్‌పల్లిలోని లగ్జరీ గ్రీన్ విల్లాలోని మూడు విల్లాలపై ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. క్యాప్స్ గోల్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంట్లో కూడా పది ఐటీ బృందాలు ఒకేసారి తనిఖీలు జరిపాయి.

మొత్తం మీద, హైదరాబాద్, వరంగల్, విజయవాడలలో కలిపి 15 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి క్యాప్స్ గోల్డ్ పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి, రిటైల్ గోల్డ్ షాపులకు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ శాఖ భారీ స్థాయిలో తనిఖీలు జరిపి, పన్ను చెల్లింపుల్లో అవకతవకలు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం బయటపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories