Ponguleti Srinivas Reddy: పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

IT And ED Raids Ponguleti Residence
x

Ponguleti Srinivas Reddy: పొంగులేటి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

Highlights

Ponguleti Srinivas Reddy: త్వరలో తనపై ఐటీ దాడులు జరుగుతాయని.. నిన్న కామెంట్స్ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Ponguleti Srinivas Reddy: ఖమ్మంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు, కార్యాలయంలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అధికారులు 8 వాహనాల్లో వచ్చి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి అనుచరుల ఫోన్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో పొంగులేటి నివాసంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుంటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని నిన్ననే పొంగులేటి కామెంట్స్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులు జరగడం గమనార్హం. కాగా ఇవాళ పొంగులేటి నామినేషన్ వేయాలని భావించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories