ఓ ఎమ్మెల్యేను వీడని పీడకల.. సదరు ఎమ్మెల్యేపై త్వరలో చర్యలు తప్పవంటూ ఊహాగానాలు ?

ఓ ఎమ్మెల్యేను వీడని పీడకల.. సదరు ఎమ్మెల్యేపై త్వరలో చర్యలు తప్పవంటూ ఊహాగానాలు ?
x
ఓ ఎమ్మెల్యేను వీడని పీడకల.. సదరు ఎమ్మెల్యేపై త్వరలో చర్యలు తప్పవంటూ ఊహాగానాలు ?
Highlights

ఆ నేతకు నిద్రలోనూ అవే కలవరింతలట. కలలోనూ, ఇలలోనూ అవే పలవరింతలట. పీడకలలా పీడిస్తున్నాయట. తిన్న అన్నం కూడా సయించడం లేదట. ఇంతకీ ఇంతగా వణికిపోతున్న ఆ...

ఆ నేతకు నిద్రలోనూ అవే కలవరింతలట. కలలోనూ, ఇలలోనూ అవే పలవరింతలట. పీడకలలా పీడిస్తున్నాయట. తిన్న అన్నం కూడా సయించడం లేదట. ఇంతకీ ఇంతగా వణికిపోతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఎందుకంతగా టెన్షన్‌ పడుతున్నారు? ఆ‍యన్ను వెంటాడుతున్నదేంటి?

నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, స్థానిక టీఆర్ఎస్‌ నేతలకు ఇంకా పీడకలగానే వెంటాడుతున్నాయి. పడుకున్నా, లేచినా, అవే ఫలితాలు తరుముతున్నాయట. ఇలాంటి రిజల్ట్‌తో తమ భవిష్యత్తు ఏమవుతుందో, గులాబీ అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏ గతి పట్టిస్తారోనని టెన్షన్‌ టెన్షన్‌ పడుతూ, తిన్న అన్నం కూడా సయించడం లేదట నేతలకు. అంత ఘోరంగా వచ్చాయా ఫలితాలు ముథోల్‌ సెగ్మెంట్‌లో.

అంత ఘోరంగా కాదు, ఘోరాతి ఘోరంగా. భైంసా మున్సిపాలిటీ మొత్తం ఇరవై ఆరు వార్డులున్నాయి. పదిహేను స్థానాలతో మున్సిపల్ పీఠాన్ని ఎంఐఎం ఎగరేసుకుపోయింది. తొమ్మిది సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలిచింది. మరో రెండు వార్డుల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. కానీ ఒక్కటంటే, ఒక్క సీటు కూడా రాలేదు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు. అదే ప్రగతి భవన్‌లో వున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్సలు మింగుడుపడటం లేదట. అసలు ఈ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే వున్నారా లోకల్‌గా పార్టీ శ్రేణులున్నాయా అన్న సందేహం వస్తోందట గులాబీ అధిష్టానానికి. అందుకే లోకల్‌ ఎమ్మెల్యేకు అస్సలు కంటిమీద కనుకు కరువైందట.

ముథోల్‌‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి. ఇదే నియోజకవర్గంలోని భైంసా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఆ‍యన గ్రాఫ్‌ను అమాంతం నేలకు పడేశాయి. కనీసం ఒక్కవార్డు సభ్యుడు కూడా పార్టీ తరపున విజయం సాధించకపోవడంపై, పార్టీ పెద్దలు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కనీసం గల్లీ ఎన్నికల్లో ప్రభావం చూపించని ఎమ్మెల్యే, పార్టీకి ఏవిధంగా ఉపయోగపడతారని పార్టీ పెద్దలకు అనుమామాలు మొదలయ్యాట. పార్లమెంటు ఎన్నికల్లోనూ, ఇలాంటి ఫలితాలు రావడంతో, ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డిపై ప్రగతిభవన్‌ వర్గాలు గుర్రుగా వున్నాయట.

మరోవైపు విఠల్ ప్రభావం తగ్గడానికి కుటుంబ సభ్యులు సైతం కారణమన్న మాటలు వినపడ్తున్నాయి. విఠల్ రెడ్డికి షాడో ఎమ్మెల్యేలుగా, కొందరు కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతున్నారట. దానివల్లనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందట. వీటి ఎఫెక్టే పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో పడిందన్న చర్చ జరుగుతోంది. వరుస చేదు ఫలితాలు స్థానిక ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తున్నాయట. అయితే, భైంసాలో గెలుపొందింది ఎంఐఎం అని, దీంతో ఫ్రెండ్లీ పార్టీకే పీఠం దక్కింది కాబట్టి, కేసీఆర్ అంత కోపంగా లేరని కూడా కొందరంటున్నారు. చూడాలి, ఫలితాలు రివర్సయిన మున్సిపాల్టీల్లో స్థానిక నేతలపై పార్టీ అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా లేదంటే కొన్ని హెచ్చరికలు చేసి ఊరుకుంటుందో..?



Show Full Article
Print Article
More On
Next Story
More Stories