TS Cabinet: సీఎం రేవంత్ హస్తిన టూర్‌పై ఆసక్తి.. ఎవరికి ఏ శాఖ?

Interested In CM Revanth Delhi Tour
x

TS Cabinet: శాఖల కేటాయింపుపై వీడని ఉత్కంఠ

Highlights

TS Cabinet: సీనియార్టీని దృష్టిలో పెట్టుకోవాలంటున్న సీనియర్లు

TS Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీగా భట్టితో పాటు మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం తొలి కేబినెట్ కూడా అయ్యింది. ఐతే మంత్రివర్గం ఏర్పడినప్పటికీ ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపు అయితే జరగలేదు. పలానా మంత్రికి పలానా శాఖ ఇచ్చారని నిన్న జోరుగా వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని స్పయంగా మంత్రులే తెలిపారు. దీంతో ఎవరెవరికి ఏ ఏ శాఖ కేటాయిస్తారనే ఆసక్తి నెలకొంది. కీలక పోర్ట్‌పోలియోలను ఏ మంత్రికి ఇస్తారు. సీనియార్టీని దృష్టిలో పెట్టుకుని బాధ్యతలు ఇస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.

రేవంత్‌ టీమ్‌లో మొత్తం 18మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అందులో 12 మందితో తొలి కేబినెట్ కూర్పు జరిగింది. ఇంకా ఆరుగురికి ఛాన్స్ ఉంది. అవి కూడా ఫిలప్ చేసి.. ఒకేసారి మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందా అనే వార్తలు వస్తున్నాయి. ఐతే ఉన్నట్టుండి.. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో అందరి దృష‌్టి సీఎం హస్తిన పర్యటనపై పడింది. అధిష్టానంతో చర్చించి..వారి నిర్ణయం మేరకు మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు మిగతా ఆరుగురు ఎవరు అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం దక్కలేదు. వీళ్లలో సీనియార్టీతో పాటు సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని.. మంత్రివర్గ విస్తరణ ఉండనుందా అనే ప్రచారం జరుగుతోంది.

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో సీనియర్లు.. కీలక పోర్ట్ పోలియోలను అడుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్ధిక, రెవెన్యూ, హోం, పురపాలక, గ్రామీణాభివృద్ధి, పరిశ‌్రమలు, నీటి పారుదల శాఖలకు డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం భట్టికి రెవెన్యూ, ఉత్తమ్‌కు హోం, కోమటిరెడ్డికి పురపాలక, శ్రీధర్ బాబుకు ఫైనాన్స్ వంటి శాఖలు కేటాయించినట్టి నిన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐతే ఆ ప్రచారాన్ని ఆయా మంత్రులు పెద్దగా ఖండించకపోవడంతో.. వాటితో సంతృప్తి చెందారా..? ఆ శాఖలనే మంత్రులు కోరుకుంటున్నారా అనే ప్రశ‌్నలు తెలుత్తుతున్నాయి.

మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న శ్రీధర్‌ బాబుకు హామీల అమలుపై పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి.. ఆర్ధిక శాఖను ఆయనకే కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా కీలకం. అలాంటి శాఖను ఉత్తమ్‌కే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాభివృద్దికి రెవెన్యూ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి.. ఆ పోర్ట్ పోలియోను భట్టి డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏదైమైనా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత.. శాఖల కేటాయింపుపై.. క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories