TS Inter Second Year Results 2021: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు

Inter Second Year 2021 Results Going to be Released Today
x
విడుదల కానున్న ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు (ఫైల్ ఇమేజ్)
Highlights

TS Inter Second Year Results 2021:కరోనా నేపథ్యంలో రద్దయిన పరీక్షలు * జనరల్ విద్యార్థులు 4,28,986 మంది

TS Inter Second Year Results 2021: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం వార్షిక పరిక్షలను రద్దుచేసింది. ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే సెకండియర్‌లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సర్కార్ విడుదల చేసింది. దాంతో ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థిని పాస్ చేసే విధంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. మొత్తం 4 లక్షల 73 వేల 967 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో లక్షా 99 వేల 19 మంది ఫస్ట్ ఇయర్‌లో తప్పినవారున్నారు. వీరికి ఆ సబ్జెక్టుల్లో 35శాతం మార్కులు ఇవ్వనున్నారు. ఇంటర్ సంవత్సర పరీక్షలకు ఫీజులు చెల్లించిన వారిలో జనరల్ విద్యార్థులు 4 లక్షల మంది, వొకేషనల్ విద్యార్థులు 44 వేల 981 మంది ఉన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలకు గానూ వంద మార్కులను వేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories