నేడు సింగరేణి కార్మికుల దీక్ష

Initiation of Singareni workers today
x

నేడు సింగరేణి కార్మికుల దీక్ష

Highlights

Singareni: బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దీక్ష, జిల్లాల్లో దీక్షకు దిగనున్న స్థానిక టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు.

Singareni: బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. బొగ్గు బ్లాక్‌ల వేలం, ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ఇర‌కాటంలో పడేసేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే సింగరేణి బొగ్గు గనుల పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం TBGKS ఆందోళన చేస్తోంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ దాని అనుబంధ సంఘం TBGKS కు పరోక్ష మద్దతు ఇవ్వగా.. తాజాగా టీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి దిగుతోంది. నేడు చేపట్టే నిరాహార దీక్షల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

ఆరు జిల్లాల పరిధిలోని అన్ని గ‌నులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్‌మెంట్లు, కార్మిక ప్రాంతాల్లో దీక్షలు చేయ‌నున్నారు. దీనికి తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌ల‌తో పాటు.. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేత‌లు హాజ‌ర‌వుతారు. ఎట్టి ప‌రిస్థితుల్లో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ ఉప‌సంహ‌రించే వ‌ర‌కు త‌గ్గేది లేద‌ని టీఆర్ఎస్‌, TBGKS నేత‌లు చెబుతున్నారు. మంద‌మ‌ర్రి మార్కెట్ ఏరియాలో బాల్క సుమ‌న్, బెల్లంప‌ల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దీక్షలో పాల్గొంటారు. మిగతా జిల్లాల్లోని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు దీక్షల్లో పాల్గొంటారు. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో పాటు మిగ‌తా టీఆర్ఎస్, TBGKS నేత‌లు నిరాహార దీక్షలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories