Telangana: లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిసిన ఇందిరా శోభన్

Telangana: షర్మిలకు మద్దతుగా.. ఓ మహిళగా కలిశాను: ఇందిరా శోభన్

Sandeep Eggoju
Published on: 3 March 2021 3:54 PM IST
Indira Shobhan meets YS Sharmila In Lotus Pond
X

వైస్ షర్మిల అండ్ ఇందిరా శోభన్ (ఫైల్ ఇమేజ్)

Telangana: కాంగ్రెస్ పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదనే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అంటే తనకు ఎంతో అభిమానం అన్న శోభన్.. షర్మిలకు మద్దతుగా ఓ మహిళగానే ఆమెను కలిసినట్లు తెలిపారు. తెలంగాణ లక్ష్యాన్ని ప్రభుత్వం నీరుగార్చిందన్న ఇందిర.. రాజన్న సంక్షేమ పథకాలలో స్వర్ణయుగం నడిచిందని తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులే తమ ప్రధాన పోరాటం అని షర్మిల చెప్పారన్న ఇందిరా శోభన్.. తన బాట కూడా అదే కావడంతో షర్మిలతో కలసి నడవాలనుకున్నట్లు తెలిపారు. మహిళలంతా షర్మిలకు మద్దతుగా నిలబడతామని ఇందిరశోభన్ స్పష్టం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story