రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మార్చిన కేంద్రం

రాయగిరి రైల్వేస్టేషన్ పేరు మార్చిన కేంద్రం
x
Highlights

ఖాజీపేట నుంచి హైదరాబాద్ మధ్యలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉన్న రాయగిరి స్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చింది...

ఖాజీపేట నుంచి హైదరాబాద్ మధ్యలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రికి అతి సమీపంలో ఉన్న రాయగిరి స్టేషన్‌ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చింది రైల్వేశాఖ. యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మార్చుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు కేంద్రం నుంచి ఉత్తర్వు లు జారీ అయ్యాయి. సెప్టెంబరు 18 నుంచే స్టేషన్ పేరును మార్చి అమల్లోకి వచ్చిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ స్టేషన్‌కు యాదాద్రి అని పేరు పెట్టాలనే డిమాండ్ ఆ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. ఇక పోతే తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తయితే ఈ ఆలయానికి తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.

ఇందులో భాగంగానే ఘట్‌కేసర్‌ వరకు మాత్రమే అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్‌ సర్వీసులను రాయగిరి వరకు పొడిగించాలని ప్రతిపాదన చేసింది. అంతేకాక, రాయగిరి రైల్వేస్టేషన్‌ పేరును యాదాద్రిగా మార్చాలని 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశారు. ఈ క్రమంలో ఎంఎంటీఎస్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్‌ పేరును కూడా మార్పు చేసింది. ఇందుకు సంబంధించి ఈనెల 18న దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్‌కు పేరు మార్పుతో యాదాద్రి దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories