స్పెషల్ ఫ్లైట్‌లో కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థీవదేహం..

స్పెషల్ ఫ్లైట్‌లో కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థీవదేహం..
x
Colonel Santosh babu (file photo)
Highlights

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారతీయ ఆర్మీ చైనా ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా కాల్పులకు...

భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. లడఖ్‌లోని గాల్వన్ ప్రాంతంలో భారతీయ ఆర్మీ చైనా ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చైనా కాల్పులకు తెగబడింది. చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్‌ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. క‌ల్న‌ల్ సురేష్‌ ల‌డ‌ఖ్‌లోని ఇన్‌ఫాంట్రీ ద‌ళానికి క‌మాండింగ్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు.

ఇక దేశం కోసం పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోష్‌ పార్థీవ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్ పోర్టుకు తరలించింది. నేడు (బుధవారం) సాయంత్రం 4 గంటలకు పార్థీవదేహం హైదరాబాద్ చేరుకుంటుంది. హకీమ్ పెట్ ఎయిర్పోర్ట్ కు ఆయన భౌతికాయం చేరుకోగానే అధికారులు గౌరవ వందనం ఇవ్వనున్నారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన మృతదేహాన్ని సూర్యాపేటకు తరలిస్తారు. అనంతరం సూర్యపేట జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు రేపు(గురువారం) నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటికే ఆర్మీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

దేశంలో కోసం ప్రాణాలు కోల్పోయిన సంతోష్‌ను కడసారి చూడటం కోసం వేలాది మంది ప్రజలు ఆరాటపడుతున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో ఇది సాధ్యం కాకపోవచ్చు, కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధువుల సమక్షంలోనే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఇక సంతోష్ భార్యా పిల్లలు ఈ రోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. కాగా వారిని సీపీ సజ్జనార్ వారిని రిసీవ్ చేసుకున్నారు. కల్నల్ కుటుంబ సభ్యులని ననల్ నగర్ ఆర్మీ గెస్ట్ హౌస్ కి తరలించారు. ప్రత్యేక వాహనంలో వారిని సూర్యాపేట పంపించనున్నారు.

ఇక దేశంలో కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన కల్నల్ సంతోష్ తల్లి కొడుకును కోల్పయిన బాధను దిగ మింగిలేక పోతున్నారు. ఓ వైపు కన్న తల్లిగా కడుపుకోతకు గురైనప్పటికి మాతృదేశం కోసం పోరాడి ప్రాణాలను త్యాగం చేసి దేశం రుణం తీర్చుకున్నందుకు గర్వంగా ఉందని సంతోశ్ తల్లిదండ్రులు అంటున్నారు. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి సంతోష్ తల్లిదండ్రలకు హ్యాట్సాఫ్ అని అన్నారు. ఓ దేశ భక్తున్ని కన్న సంతోశ్ తల్లిదండ్రులను చూసి దేశం గర్వ పడాలని ఆయన అన్నారు.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్మీ అధికారులు సంతోష్ అంత్యక్రియలను హైదరాబాద్‌లోనే నిర్వహించాలని కోరినప్పటికీ సంతోష్ తల్లిదండ్రులు కోరిక మేరకు ఆయన పుట్టిన ఊరిలోనే అంటే సూర్యపేటలో సంతోష్ అంత్యక్రియలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దేశం కోసం ప్రాణం విడిచిన సంతోష్ కు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఇక సంతోశ్ భౌతిక కాయాన్ని త్వరగా రప్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories