పెరిగిన GST రేట్లు... నిన్నటి నుంచే అమ‌ల్లోకి...

Increased GST rates... effective from yesterday...
x

 పెరిగిన GST రేట్లు... నిన్నటి నుంచే అమ‌ల్లోకి... 

Highlights

GST Rates: నూత‌న GST రేట్లు అమ‌ల్లోకి రావ‌డంతో ప‌లు ఆహారోత్ప‌త్తులు, వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు భగ్గుమంటున్నాయి

GST Rates: పెరిగిన GST రేట్లు నిన్నటి నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. నూత‌న GST రేట్లు అమ‌ల్లోకి రావ‌డంతో ప‌లు ఆహారోత్ప‌త్తులు, వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు భగ్గుమంటున్నాయి. ప్రీ ప్యాక్డ్, ప్యాకేజ్‌డ్ ఆహోరోత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ‌ర్లు అధిక మొత్తం చెల్లించాల్సి వస్తోంది. నిర్ధిష్ట వ‌స్తువులు, ఉత్ప‌త్తుల‌పై GST రేట్లు పెర‌గ‌డంతో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లూ మండిపోతున్నాయి. హోట‌ల్ రూంలు, బ్యాంక్ సేవ‌లు ప్రజలకు భార‌మ‌య్యాయి. ఇక ఎలక్ట్రిక్ వాహ‌నాల‌పై GST రేటు 5 శాతం త‌గ్గ‌డం ఒక్క‌టే కొంత ఊర‌ట క‌లిగిస్తోంది. ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌తినిధుల‌తో కూడిన GST కౌన్సిల్‌లో నిర్ణ‌యాల‌కు అనుగుణంగా తాజా GST రేట్లు అమ‌ల్లోకి వ‌చ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories