మట్టి కుండలకు పెరిగిన గిరాకీ...

Increased Demand for Clay Pots
x

మట్టి కుండలకు పెరిగిన గిరాకీ... 

Highlights

*ఖమ్మంలో జోరుగా మట్టి కుండల అమ్మకాలు

Khammam: తరాలు మారుతున్నా సంప్రదాయమట్టి పాత్రల ఉపయోగం నానాటికీ, విలువ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత తరుణంలో ప్లాస్టిక్ ఉపయోగం పెరుగుతోంది. కానీ వేసవిలో మట్టి కుండల,పాత్రల వినియోగం పెరుగుతోంది. వేసవిలో అందరూ మట్టికుండలపై ఆసక్తి చూపుతున్నారు. పేద వాడి ఫ్రీజ్ గా ప్రాచుర్యం పొందిన మట్టి కుండలపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఖమ్మం జిల్లాలో కరోనా తర్వాత ప్రజల దైనందిన జీవితాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. భగభగ మండే ఎండల్లో. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మట్టి పాత్రలోనే నీరు తాగేందుకు అందరూ మంది ఇష్ట పడుతున్నారు..కుండ నీరు తాగే వారు వ్యాధుల బారిన పడే అవకాశం లేదంటున్నారు. బీపీ,షుగర్, థైరాయిడ్, మధుమేహం కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు బారిన పడే అవకాశం లేదని ..తయారీదారులు అమ్మకందారులు చెబుతున్నారు.

అయితే కుండలు తయారు చేసి అమ్మేవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రోడ్లపక్క ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ అమ్మకాలు జరుపుతున్నారు.

ఖమ్మం జిల్లాలో 500 కుటుంబాలకు పైగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం నుంచి.. ఎటువంటి సహాయం లేక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వారంటున్నారు. రాష్ట్రం రావడానికి ముందు, రాష్ట్రం వచ్చాక తమ జీవనస్థితిగతుల్లో ఎలాంటి మార్పులేదంటున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఇవ్వాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories